మధ్యప్రదేశ్‌లో 1355 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-04-18 16:04 GMT

మధ్యప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ మొత్తం 1355 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మొత్తం 23070 శాంపిళ్లను పరీక్షించామని.. ఇంకా 2708 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉందని వెల్లడించింది. ఇండోర్‌లో 47 మందితో సహా రాష్ట్రంలో మొత్తం 69 మంది మరణించారు. ఇండోర్ మరియు భోపాల్‌లో అత్యధిక కేసులు నమోదవ్వగా మరో 25 కరోనావైరస్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలలో వ్యాప్తి అంతగా లేకపోయినా అక్కడక్కడా ఒక్కో కేసు నమోదయింది. ఇండోర్‌లో 881 కరోనావైరస్ కేసులు ఉండగా, భోపాల్ లో 208 ఉన్నాయి.

Similar News