ఢిల్లీ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఏప్రిల్ 20 తరువాత కూడా లాక్‌డౌన్ ఇలాగే కొనసాగుతుందని.. ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. వారం తర్వాత సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ చెప్పారు. తబ్లీగీ జమాతే మర్కజ్ ప్రభావం ఎక్కువగా ఢిల్లీపై పడిందని కేజ్రీవాల్ తెలిపారు. శనివారం ఒక్కరోజే 186 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రస్తుతం 26 మంది రోగులు ఐసీయూలో, ఏడుగురు వెంటీలేటర్‌పై ఉన్నారని సీఎం చెప్పారు.
కాగా ఢిల్లీలో ఇప్పటివరకు 1893 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 42 మంది కరోనా కోరల్లో చిక్కుకొని మృతిచెందారు.