బ్రిటన్ లో రెండు రోజుల్లో పెరిగిన మరణాల సంఖ్య

Update: 2020-04-19 08:58 GMT

బ్రిటన్ లో మరణాల సంఖ్య శనివారం 15 వేల 464 కు పెరిగిందని ఆరోగ్య సంస్థ డిహెచ్‌ఎస్‌సి తెలిపింది. శుక్రవారం , శనివారం మధ్య 888 మంది మరణించారు. అంతేకాదు ఈ రెండు రోజుల్లో 5 వేల 525 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా క్వీన్ ఎలిజబెత్ పుట్టినరోజు సందర్భంగా గన్ సెల్యూట్ ఈవెంట్ రద్దయింది.

కొన్ని మీడియా నివేదికల ప్రకారం, సంక్రమణ పెరగడానికి ప్రధాన కారణం ఇంటి నుండి ప్రజలు తరచూ బయటికి వెళ్లడమే అని. బ్రిటన్ లో లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కొంతమంది ప్రజలు దీనిని పాటించడం లేదు దాంతో వైరస్ కేసులు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇదిలావుంటే యూకేలో మొత్తం 114,217 పాజిటివ్ కేసులుండగా.. కేవలం వందలో మాత్రమే రికవరీ అయ్యారు.

Similar News