భారీగా తగ్గిన బంగారం ధర

Update: 2020-04-20 14:37 GMT

గతవారం రికార్డ్‌ స్థాయి గరిష్టానికి చేరిన బంగారం ధరలు ప్రస్తుతం శాంతించాయి. గత రెండు రోజుల్లో గోల్డ్‌ రేట్‌ రూ.1800 తగ్గింది. వెండి ధర మాత్రం సోమవారం స్వల్పంగా పెరిగింది. గోల్డ్‌రేట్‌ ఆల్‌ టైమ్‌ గరిష్టానికి చేరడంతో ఎంసీఎక్స్‌లో సోమవారం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీయ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో గోల్డ్‌ రేట్‌ అరశాతం క్షీణించి (రూ.235) రూ.45,500 వద్ద ట్రేడవుతోంది. ఇంతకుముందు సెషన్‌లో గోల్డ్‌ రేట్‌ 10 గ్రాములు రూ.1600 తగ్గింది. సోమవారం కూడా ధర దిగిరావడంతో గత రెండు రోజుల్లో బంగారం రూ.1800 తగ్గినట్లయింది.

Similar News