పెట్రోల్ కావాలా బాబూ.. అయితే మాస్క్ మస్ట్..

Update: 2020-04-19 18:50 GMT

ఇలా ఎవరికి వారు కొన్ని రూల్స్ పెడితే తప్ప జనంలో మార్పు రాదేమో.. నిజంగా ఇది ఓ మంచి నిర్ణయం అని అంటున్నారు నగర వాసులు. కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రభుత్వం చెబుతున్న జాగ్రత్తలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత అలవరచుకోవడం ఎంతైనా అవసరం. కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకుని వస్తేనే పెట్రోల్ పోయమని చెబుతూ ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఓ రూల్ పాస్ చేసింది. మాస్క్ లేకుండా వస్తే పెట్రోల్ పోయవద్దని డీలర్స్ సంఘం అధ్యక్షుడు అజయ్ బన్సల్ బంక్ యాజమాన్యాన్ని ఆదేశించారు. తమ సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఈ రూల్ అమలవుతోంది.

Similar News