సాప్ట్‌వేర్ ఇంజనీర్ నెలరోజులుగా గుహలోనే లాక్‌డౌన్..

Update: 2020-04-20 20:07 GMT

ముంబైకి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ వీరేంద్ర సింగ్ డోగ్రా మార్చినెలలో కాలినడకన నర్మదా పరిక్రమ తీర్ధయాత్రకు బయలుదేరారు. ఇంతలో మార్చి 24 నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రారంభమైంది. దీంతో వీరేంద్ర తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించలేకపోయారు. ఈ పరిస్థితిలో అతడు మధ్యప్రదేశ్‌లోని రైసన్ జిల్లా ఉదయపుర అడవుల్లో ఉన్న ఓ గుహలో తల దాచుకున్నారు. అతడిని ఓ పశువుల కాపరి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని బయటకు తీసుకువచ్చారు. అతడి దగ్గర రెండు జతల బట్టలు, మహాభారత గ్రంధం ఉన్నాయి. పరిక్రమంలో నర్మదా నదిని మధ్యప్రదేశ్‌లోని అమరకాంటక్ నుంచి గుజరాత్‌లోని నది ముఖ ద్వారం వరకు కాలినడకన ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. వీరేంద్రను పోలీసులు కుయాండ్రేవి గ్రామంలోని తన బంధువుల ఇంటికి పంపించారు. హైదరాబాద్‌లో తన సోదరి ఉందని వీరేంద్ర పోలీసులకు తెలిపారు.

Similar News