భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. తాజాగా దేశంలో కరోనావైరస్ సోకిన రోగుల సంఖ్య 20,183 కు పెరిగింది. ఇప్పుడు అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా 17 దేశాల సరసన భారత్ చేరింది, ఇక్కడ 20,000 కి పైగా ఇన్ఫెక్షన్ కేసులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు నమోదయ్యాయి, అంతేకాదు మరణాల సంఖ్య 600 దాటింది. రాజస్థాన్‌లో తాజాగా.. 64, పశ్చిమ బెంగాల్‌లో 31, ఒడిశాలో 3 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక రికార్డు స్థాయిలో నిన్న 702 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు. ఈ గణాంకాలు covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం ఉన్నాయి.