ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ఇటు భారత్‌లోనూ తన ప్రతాపాన్ని రోజురోజుకీ ఉద్ధృతం చేస్తోంది. ఇక ఈ మహమ్మారి పంజాబ్‌లో సైతం పంజా విసిరింది. రాష్ట్రంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ ప్రాణాంతకర వైరస్ ఆరు నెలల చిన్నారిని మింగేసింది.
పంజాబ్‌లోని పగ్వారాకు చెందిన 6 నెలల పాప.. కరోనా లక్షణాలతో ఏప్రిల్ 9న పగ్వారాలోని అడ్వాన్స్‌డ్ పిడియాట్రిక్ సెంటర్‌లో చికిత్స పొందింది. అయితే ఆమెను అక్కడి నుంచి లూథియానాలోని కోవిడ్ చికిత్స వసతులున్న నెహ్రూ హాస్పిటల్ ఎక్స్‌టెన్షన్‌కు తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి దిగజారుతుండటంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో వెంటీలేటర్ ఉన్న ఆ బాలిక గురువారం మధ్యాహ్నం మృత్యు ఒడిలోకి ఒరిగిపోయింది.