పశ్చిమబెంగాల్ గవర్నర్.. సీఎం మమతా బెనర్జీపై మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనాను ఎదుర్కోవడంలో మమత ప్రభుత్వం విఫలమైందని ఇటీవల విమర్శించిన గవర్నర్.. తాజాగా కేంద్ర బలగాలు.. రాష్ట్రంలో పర్యటించేందుకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.
కరోనాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కొన్ని రాష్టాలలో కేంద్ర బృందాలు ప్రయతిస్తున్నాయి. అయితే.. తమను సంప్రదించకుండా రాష్ట్రంలోకి కేంద్ర బలగాలను ఎలా పంపిస్తారని మమతా.. కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ విమర్శలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం బెంగాల్ లో పర్యటిస్తే.. మమతా ప్రభుత్వం ‘రెడ్ కార్పెట్’తో స్వాగతించిందని.. కానీ కేంద్ర బలగాలకు ఎన్సీదుకు సహకరించలేదని ఆయన ప్రశ్నించారు.