దేశంలో మరోసారి పెరిగిన మరణాల సంఖ్య

Update: 2020-04-24 00:55 GMT

భారత్ కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గురువారం సాయంత్రం వరకూ 1,200 కి పైగా కొత్త కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో కేసుల సంఖ్య 21,000 మార్కును దాటింది. అలాగే భారతదేశంలో 24 గంటల్లో 34 మరణాలను నమోదు కావడంతో కోవిడ్ -19 కారణంగా మరణించిన వారి సంఖ్య 686 కు చేరుకుంది.

గురువారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అప్‌డేట్ చేసిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో ఇప్పటివరకూ 4,000 మందికి పైగా డిశ్చార్జ్ కావడంతో ప్రస్తుతం 16,600 క్రియాశీల కరోనావైరస్ కేసులు ఉన్నాయని పేర్కొంది. మొత్తం కేసులలో 77 మంది విదేశీ పౌరులు కూడా ఉన్నారు.

ఇక మొత్తం 686 మంది మరణాలలో.. 269 తో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర తరువాత గుజరాత్ 103, మధ్యప్రదేశ్ 81, ఢిల్లీ 48, రాజస్థాన్ 27, ఆంధ్రప్రదేశ్ 27, తెలంగాణలో 24 మరణాలు నమోదు అయ్యాయి.

Similar News