గురువారం 478 కొత్త కేసులు నమోదు కావడంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కోవిడ్ -19 రోగుల సంఖ్య 4,232 కు చేరిందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) తెలిపింది. అలాగే మరణాల సంఖ్య కూడా పెరిగిందని వెల్లడించింది. ప్రస్తుతం ముంబైలో సంక్రమణ కారణంగా మరణించిన వారి సంఖ్య 168 కు పెరిగిందని పౌరసంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
కోలుకున్న తర్వాత మరో 48 మంది రోగులను తమ స్వస్థలాలకు పంపామని.. దీంతో డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య గురువారం 473 కు చేరిందని తెలిపింది. BMC ప్రకారం, నగరంలో 3593 క్రియాశీల కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 5500 లకు పైగా పెరిగింది.