వూహాన్‌ని తలపిస్తున్న హర్బిన్.. ఒకరి నుంచి 70 మందికి!!

Update: 2020-04-25 15:25 GMT

కరోనా మహమ్మారిని తరిమికొట్టేశామని సంతోషిస్తున్న సమయంలో చైనాకు పెద్ద తలనొప్పిగా మారింది హర్బిన్. ఇది మరో ఊహాన్‌గా మారిపోతుందా ఏంటీ అని ఆందోళ న చెందుతోంది చైనా ప్రభుత్వం. ఇక్కడి జనాభా కోటి మాత్రమే అయినా ఇతర దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈశాన్య చైనా నగరంలో ఉన్న హర్బిన్‌తో పాటు పలు నగరాల్లో రాకపోకలను తగ్గిస్తూ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఇతర ప్రాంతాల వారిని రానివ్వకుండా కట్టడి చేసింది. కొత్త కేసులు వెలుగు చూస్తుండడమే ఈ పరిస్థితికి కారణం. అమెరికా, రష్యాలో ఉన్న చైనీయులంతా ఒక్కసారిగా తిరిగి వచ్చేస్తున్నారు. అలా న్యూయార్క్ నుంచి హర్బిన్ వచ్చిన ఓ విద్యార్థి నుంచి 70 మందికి కరోనా వైరస్ వచ్చింది. దీంతో నగరాన్ని నాలుగువైపులా మూసివేశారు. రవాణా వ్యవస్థను పూర్తిగా స్థంభింప చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు నానాతంటాలు పడుతోంది హర్బిన్ నగరం.

Similar News