కొత్త చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌గా సంజయ్ కొఠారి నియామకం

Update: 2020-04-25 15:45 GMT

శనివారం చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌గా సంజయ్ కొఠారి రాష్ట్రపతి భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రపతి కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన.. గతంలో ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్టు చైర్మన్‌గా పనిచేశారు. హ‌ర్యానా క్యాడ‌ర్‌కు చెందిన సంజయ్.. 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సీవీసీగా ఆయన్ను నియమిస్తూ ఫిబ్రవరి 29న కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Similar News