వైన్ షాపులు మాత్రమే తెరిస్తే.. ప్రభుత్వానికి ఆదాయం రాదు.. రాజ్ థాకరేకు శివసేన కౌంటర్

Update: 2020-04-25 17:41 GMT

మహారాష్ట్ర ప్రభుత్వం వైన్ షాపులు తిరిగి తెరవాలని.. దీంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని డిమాండ్ చేసిన ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే శివసేన గట్టిగా సమాధానం చెప్పింది. లాక్‌డౌన్ కారణంగా వైన్ షాపులు మాత్రమే కాదు.. లిక్కర్ ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయని రాజ్ థాకరే తెలుసుకుంటే మంచిదని అన్నారు.

దుకాణాలు తెరిస్తే.. ఆదాయం రాదనీ.. ఫ్యాక్టరీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు లిక్కర్ రావాలని.. అప్పుడే ఎక్సైజ్, సేల్స్ టాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తెలిపింది. ఫ్యాక్టరీలు తెరవాలంటే వర్కర్ల అవసరముంటుందని.. ఈ సమయంలో అది మంచిది కాదని తేల్చి చెప్పింది. అదీగాక, దుకాణాలు తిరిగి తెరిస్తే సామాజిక దూరం కూడా పాటించరని సామ్నా ద్వారా తెలిపింది.

వైన్‌షాపులు తిరిగి తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని.. దీంతో ఆల్కహాల్ తీసుకునే వారి అవసరాలు తీరడంతో పాటు కష్టకాలంలో ప్రభుత్వానికి రెవెన్యూ కూడా వస్తుందని రాజ్‌థాకరే ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Similar News