పేకాట ఆడాడు.. 17 మందికి 'కరోనా'ని పంచాడు

Update: 2020-04-25 20:10 GMT

ఆ మధ్య సూర్యాపేటలో ఓ అమ్మ అష్టాచెమ్మా ఆడి 31 మందికి కరోనాను అంటిస్తే.. ఇప్పుడు విజయవాడకు చెందిన ఓ కరోనా బాదితుడు పేకాట ఆడి మరో 17 మందికి పంచాడు. స్థానిక కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్య వీధిలో నివసిస్తున్న లారీ డ్రైవర్ ఇటీవల పశ్చిమ బెంగాల్ వెళ్లి వచ్చాడు. వచ్చిన తరువాత స్నేహితులతో కలిసి పేకాట ఆడాడు. అనంతరం జ్వరం వచ్చి కోలుకోకుండా ఉన్నాడు. కరోనా నేపథ్యంలో టెస్ట్ చేస్తే రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది. అతడిని కలిసిన వ్యక్తులను టెస్ట్ చేయగా వారికీ పాజిటివ్ అని వచ్చింది. మొత్తం 17 మందిని క్వారంటైన్‌లో వుంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

Similar News