కరోనా మహమ్మారి ఎవరిని ఎప్పుడు పట్టుకుంటుందో తెలియదు. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇంట్లో ఉన్న ఇద్దరు సోదరులకు, వారి భార్యలకు, ఒకరి కుమారుడికి, 83 ఏళ్ల తండ్రికి సోకినట్లు నిర్దారణ అయింది. తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులు వుండడం మరింత ఆందోళన కలిగించే అంశం. వీరంతా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, లాక్డౌన్ వల్ల అంతగా ఉపయోగం ఉండడంలేదని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకుతుందని ఎంపీ అంటున్నారు. మనిషి శరీరంలో ఉంటే ఇమ్యూనిటీనే అతడిని కాపాడుతుంది అని ఆయన అంటున్నారు.