చైనా వస్తువులను వాడటం నిషేధించాలని ఆదివారం నుంచి ఓ ఉద్యమంగా నిర్వహిస్తామని స్వదేశీ జాగరణ్ మంచ్ సంస్థ ప్రకటించింది. చైనా వస్తువులను బహిష్కరించాలన్నది ఈ సంస్థ మూల సూత్రాలలో ఒకటిగా ఉంది. అయితే.. తాజాగా పరిస్థితుల నేపథ్యంలో ఈ సంస్థ ఈ ఉద్యమాన్ని ఉదృతం చేయడానికి నిర్ణయించింది. ఏప్రిల్ 25 ను అందరూ ‘స్వదేశీ సంకల్ప్ దివస్’గా జరుపుకోవాలని ఆ సంస్థ పిలుపునిచ్చింది.
ఏప్రిల్ 25న తమ ఇళ్లలో సాయంత్రం 6:30 నుంచి 6:40 వరకూ దీపాలు వెలిగించి, చైనా వస్తువులను బహిష్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేయాలని స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వనీ మహజన్ తెలిపారు. చైనా సృష్టించిన కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక రంగం కూడా బాగా కుదేలైందని అశ్వనీ మహజన్ మండిపడ్డారు.