ఒక వ్యక్తికి రెండుసార్లు కరోనా సోకదని చెప్పలేం: డబ్ల్యూహెచో

Update: 2020-04-25 19:32 GMT

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి రెండోసారి ఈ వైరస్ సోకదు అని ఖచ్చితంగా చెప్పలేమని డబ్ల్యూహెచో సూచించింది. ఈ విషయంలో ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇదే విషయంపై ఇప్పటికే పలుసార్లు హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా మరోసారి అప్రమత్తం చేసింది.

లాక్ డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో కొన్ని దేశాలు.. కరోనా నుంచి కోలుకున్న వారికి రిస్క్ ఫ్రీ సర్టిఫికేట్లను జారీ చేసే ఆలోచనలో ఉన్నాయి. అయితే.. ఇది చాలా ప్రమాదమని ఈ సర్టిఫికేట్లున్న వారు భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పక్కనపెట్టి తమకు తెలియకుండానే వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందుకే.. ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా సోకదు అనటానికి శాస్త్రీయమైన ఆధారలేవీ లేవని స్పష్టం చేసింది.

Similar News