Israel Hamas: హమాస్ ‘వెస్ట్‌బ్యాంక్’ కమాండర్ హతం
12 గంటలపాటు కాల్పులు..;
ఓ వైపు ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య కాల్పుల విరమణ చర్చ కనిపించినట్లు వార్తలు వచ్చిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టెల్‌అవీవ్ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ హతమయ్యాడు. మొత్తం నలుగురు మృతి చెందగా.. వారిలో తమ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్ ఉన్నట్లు హమాస్ ధ్రువీకరించింది. అతడు 2002- 2016 మధ్యకాలంలో ఇజ్రాయెల్‌లో జైలు శిక్ష అనుభవించాడు. వెస్ట్ బ్యాంక్‌లోని తుల్కరేమ్ ప్రాంతంలో తమ దళాలు, ఉగ్రవాదుల మధ్య 12 గంటలపాటు ఎదురు కాల్పులు జరిగాయని.. ఈ క్రమంలోనే నలుగురు మరణించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అతడు 2002- 2016 మధ్యకాలంలో ఇజ్రాయెల్‌లో జైలు శిక్ష అనుభవించాడు. వెస్ట్ బ్యాంక్‌లోని తుల్కరేమ్ ప్రాంతంలో తమ దళాలు, ఉగ్రవాదుల మధ్య 12 గంటలపాటు ఎదురు కాల్పులు జరిగాయని.. ఈ క్రమంలోనే నలుగురు మరణించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది
మరోవైపు ఇజ్రాయెల్‌కు, ఖతర్ యాజమాన్యంలో నడుస్తున్న ‘అల్ జజీరా’ ప్రసార సంస్థకు మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తమ పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తోందని, హమాస్‌కు సహకరిస్తోందని టెల్‌అవీవ్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. తమ దేశంలో ‘అల్ జజీరా’ కార్యకలాపాలను మూసేయాలన్న నిర్ణయానికి అనుకూలంగా తన క్యాబినెట్ ఓటు వేసినట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘అల్ జజీరా రిపోర్టర్లు ఇజ్రాయెల్ భద్రతకు హాని కలిగించారు. అంతేగాక మా సైనికులను రెచ్చగొట్టారు. కాబట్టి ఇజ్రాయెల్ నుంచి హమాస్ తరఫున మాట్లాడేవారిని తొలగించాల్సిన సమయం ఇది’ అని తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే.. ఇది ఎప్పుటినుంచి అమల్లోకి వస్తుంది? శాశ్వతమా? లేదా తాత్కాలికమా? అనే వివరాలు తెలియరాలేదు. గతేడాది ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో దోహా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై ఆల్ జజీరా స్పందించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాల్లోని అల్ జజీరా చీఫ్ వాలిద్ ఒమరీ మాట్లాడుతూ..ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రమాదకరమని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇజ్రాయెల్ డిసిషన్ ను సవాల్ చేస్తూ కోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉందని తెలిపారు. తమ న్యాయ బృందం ఆ ప్రయత్నంలోనే ఉందని చెప్పారు. కాగా, గాజాలో దాడులను ఆపేందుకు ఈజిప్టు, యూఎస్‌లు ఇజ్రాయెల్ హమాస్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలోనే ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.