మహారాష్ట్రలో పలు ప్రాంతాలలో మే 18 వరకూ పొడగించే అవకాశం

Update: 2020-04-26 15:41 GMT

ముంబై, పుణేలోని కంటేయిన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ పొడగించే అవకాశాలూ ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ప్రకటించారు. ఈ రెండు నగరాల్లోని కంటేయిన్‌మెంట్ జోన్లలో మే 18 వరకూ లాక్‌డౌన్ పొడగించే సూచనలను కొట్టిపారేయలేమని.. ప్రధాని మోడీతో సోమవారం నిర్వహించబోయే వీడియో కాన్ఫరెన్స్ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

కేవలం కంటేయిన్‌మెంట్ ప్రాంతాలకు మాత్రమే లాక్ డౌన్ పొడిగింపు పరిమితం చేస్తామని.. ముంబై, పుణే మొత్తం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మే 16 వరకూ లాక్‌డౌన్ పొడగించిన విషయం తెలిసిందే.. ఇక.. మరి కొన్ని పొడగించే ఆలోచనలో ఉన్నాయి.

Similar News