వద్దన్నపని.. వాట్సప్‌లో స్టేటస్ పెట్టి అడ్డంగా బుక్..

Update: 2020-04-27 13:12 GMT

నేరమని తెలిసీ కోవిడ్ బాధితుడి ఫోటోని వాట్సాప్‌లో పెట్టి వైరల్ చేశాడు. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాకు చెందిన అనిల్ రాఠోడ్ అనే యువకుడు శనివారం తనతో పాటు చదువుకున్న విద్యార్థిని కోవిడ్ బారిన పడిందని స్టేటస్ పెట్టి ఫోటోతో సహా పోస్ట్ చేశాడు. 'బ్యాడ్‌న్యూస్.. ఆమెకు పాజిటివ్' అని రాశాడు. అది కాస్తా పోలీసుల కంట పడింది. వెంటనే పోలీసులు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. నిందితుడు స్థానికులను భయాందోళనకు గురి చేసే ఉద్దేశంతో ఇలా చేశాడని.. ఇది ఆ విద్యార్ధిని కించపరిచే ప్రయత్నమని పోలీసులు తెలిపారు. నిజానికి కోవిడ్ బారిన పడిన వారి వివరాలు వెల్లడించకూడదు. అది చట్టరిత్యా నేరం అని పోలీసులు వివరించారు.

Similar News