కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం జరగనున్న ఈ సమావేశంలో లాక్‌డౌన్ పైనే ప్రధానంగా చర్చిస్తారని అధికారులు తెలిపారు. మే 3 తర్వాత లాక్‌డౌన్ కోనసాగించాలా? ఎత్తివేయాలా ? లాక్ డౌన్ ఎత్తేస్తే.. తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చ జరగబోతుందని సమాచారం. ఇప్పటికే కేంద్రం విడుదల చేసిన కొన్ని మార్గదర్శాల ద్వారా సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఢిల్లీ, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.