కరోనా బారిన పడి ఇండియాలో ఒక్కరోజే 60 మంది మృతి

Update: 2020-04-28 08:18 GMT

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశంలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతున్నా.. ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నా.. కరోనా కేసుల సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,463 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక సోమవారం ఒక్కరోజే కరోనా బారిన పడి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 28,824 మంది వైరస్ బారినపడ్డారు. ఈ మహమ్మారి కారణంగా 922 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 6,856 మంది కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

Similar News