దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా దేశంలో ఈ ప్రాణాంతకర మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది . దీంతో సుప్రీం కోర్టు ఇద్దరు రిజిస్ట్రార్ల ను క్వారంటైన్ కు పంపారు. కరోనా సోకిన ఉద్యోగి గత వారం రెండుసార్లు కోర్టుకు వచ్చారట . దీంతో కరోనా సోకిన వ్యక్తి ఎవరెవరిని కలిసారనే దానిపై సిబ్బంది విచారణ జరుపుతున్నారు.