అమెరికాలో నిరుద్యోగం 16% కి చేరుకోవచ్చు : వైట్ హౌస్ సలహాదారు

Update: 2020-04-29 12:25 GMT

కరోనా సంక్షోభం కారణంగా అమెరికాలో నిరుద్యోగిత రేటు 16 శాతానికి పెరిగే అవకాశం ఉందని వైట్ హౌస్ సలహాదారు కెవిన్ హాసెట్ తెలిపారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బ అని కెవిన్ అన్నారు. 1930 మహా మాంద్యం తరువాత ఇదే చాలా కష్టమైన దశ అని చెప్పిన కెవిన్.. యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఇప్పటివరకు 30 మిలియన్లకు పైగా ప్రజలు నిరుద్యోగ భత్యాల కోసం తమ దరఖాస్తులను సమర్పించారని అన్నారు. అంటువ్యాధికి ముందు, అమెరికాలో నిరుద్యోగిత రేటు 50 సంవత్సరాలలో 3.5 శాతంగా ఉంది. కానీ అంటువ్యాధి తరువాత నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని అన్నారు.

Similar News