డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలను ప్రపంచదేశాలు సీరియస్ గా తీసుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానమ్ గెబ్రెయేసస్ ఆరోపించారు. తాము జనవరి 30నే కరోనా మహమ్మారిని అత్యంత ప్రమాదకరమైన అత్యవసర పరిస్థితిగా ప్రకటించామని.. అయితే.. ప్రపంచదేశాలు తమ హెచ్చరికలు పెడచెవిన పెట్టాయని అన్నారు. తమ సూచనలు పాటించిన దేశాలు కరోనాను ఎదుర్కోవడంలో మిగతా దేశాల కంటే ముందున్నాయని అధానమ్ పేర్కొన్నారు.