ప్రభుత్వం భరోసా కల్పించాలి.. లేదంటే.. ఉద్యోగాలు ఊడుతాయ్: చిందంబరం

Update: 2020-04-29 19:31 GMT

చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి. చిందంబరం కోరారు. లాక్ డౌన్ కారణంగా జీతాలు కోల్పోతున్న 12కోట్లమంది కోసం కూడా ప్రత్యేక పథకం ప్రకటించాలని అన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని.. కేంద్రం నుంచి ప్రైవేటు సంస్థలకు భరోసా కల్పించకపోతే.. కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారని అన్నారు. దీంతో లక్షలాది మంది జీవితాలు ప్రభావితం అవుతాయని అన్నారు.

అటు.. రాష్ట్రాలకు కూడా కేంద్రం సాయం అందించాలని.. వలస కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చిదంబరం అన్నారు. ప్రధాని వెంటనే కల్పించుకోవాలని.. జీతాలపై ఆధారపడ్డ వారిని ఆదుకునేందుకు త్వరగా ఆర్థిక సహాయక ప్యాకేజీని ప్రకటించాలని చిదంబరం కోరారు.

Similar News