సుదీర్థకాలం ప్రజలను పోషించే స్తోమత భారత్‌కు లేదు: రఘురాం రాజన్

Update: 2020-04-30 14:22 GMT

లాక్‌డౌన్‌ కొనసాగిస్తూ సుదీర్థకాలం పాటు ప్రజలను పోషించే స్తోమత భారత్‌కు లేదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన ఈ మేరకు సూచించారు. సుదీర్ఘకాలం లాక్‌ డౌన్‌ కొనసాగించడం సులభమే అయినప్పటికీ..అది సుస్థిర ఆర్థికవ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని అన్నారు. ఈ సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడానికి వినూత్న ప్రణాళిక అవసరని రాఘురాం రాజన్‌ అన్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడానికి ఎంత డబ్బు అవసరం ఉంటుందని రాహుల్ గండి అడిగిన ప్రశ్నకు రూ.65వేల కోట్లు తక్షణ అవసరమని ఆయన తెలిపారు.

Similar News