బెంగాల్ సీఎం, గవర్నర్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

Update: 2020-04-30 21:33 GMT

బెంగాల్ లో కరోనా కంటే వేగంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ ధన్కర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మమతా బెనర్జీ ప్రతిపక్షాలపై చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ ధన్కర్ తీవ్రంగా మంది పడ్డారు. మమత చిల్లర రాజకీయాలు మానుకుంటే బాగుంటుందని గవర్నర్ అన్నారు. ప్రతిపక్షాలు ‘చనిపోయిన వారి కోసం రాబందులు ఎదురుచూస్తున్నట్లు’ వ్యవహరిస్తున్నారని అంత సరికాదని అన్నారు.

అటు మీడియా వారిని జాగ్రత్తగా ప్రవర్తించండి అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చాలా సంక్షోభంలో ఉన్నామని.. చిల్లర రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని.. అన్నారు. అందరం కలిసి కరోనాను తరిమికొట్టాలని అన్నారు. మీడియా నోరునొక్కడానికి, తమకు నచ్చినట్లు నియంత్రించడానికి ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తున్నారని అనిపిస్తోందని.. మీడియాను ఎందుకు భయపెడుతున్నారు? దాచడానికి ఇందులో ఏముంది? మీడియా స్వతంత్రత దేశానికి అవసరమని.. ప్రజాస్వామ్య అంశమని గవర్నర్ ధన్కర్ అన్నారు.

Similar News