వనస్థలిపురంలో వైరస్.. ఒకరు మృతి

Update: 2020-04-30 19:09 GMT

ఆ ప్రాంతానికి విదేశాలనుంచి వచ్చిన వారు కానీ, మర్కజ్‌కి వెళ్లి వచ్చిన వాళ్లు కానీ లేరు. అయినా వైరస్ బారిన పడుతున్నారు. వనస్థలిపురం ఏ-క్వార్టర్‌లో ఒకే ఇంటిలో ఉన్న ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. అందులో ఒకరు మృతి చెందడం స్థానికుల్లో మరింత ఆందోళన కలిగిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ ఇంటి పరిసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించి రాకపోకలను కట్టుదిట్టం చేశారు. గడ్డి అన్నారం శారదా నగర్‌కు చెందిన వ్యక్తి నూనె వ్యాపారం చేస్తున్నాడు.

మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ దగ్గరలో ఉన్న అతడి సోదరుడి సహాయంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతడికి టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులందరినీ క్వారంటైన్‌లో ఉంచారు. ఈక్రమంలో అతడి తండ్రికి కూడా కోవిడ్ సోకి మృతి చెందాడు. అతడికి చికిత్స అందించిన జీవన్ సాయి ప్రైవేటు ఆసుపత్రి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నూనె వ్యాపారికి వైద్యం చేసి కోవిడ్ ఉన్న చెప్పకుండా డబ్బుల కోసం వైద్యం చేసిన ఆసుపత్రి తీరును దుయ్యబడుతున్నారు.

Similar News