కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. కరోనా కట్టడి చేయడానికి కేంద్ర సర్కార్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు మొదలుకొని అన్ని కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఉద్యోగులు, కంపెనీల అధికారులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తుడటంతో.. వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో జియో కూడా ఈ రంగంలోకి అడుగు పెట్టింది. జియో మీట్ అనే వీడియో కాన్ఫరెన్స్ యాప్ ని లాంచ్ చేసింది. తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో గూగుల్ మీట్స్, జూమ్, స్కైప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, తరహాలోనే జియో కూడా నూతన ఫీచర్లతో జియో మీట్‌ను ఆవిష్కరించింది.
జియో మీట్ వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ను వినియోగించేందుకు ఈమెయిల్‌తో సైన్‌అప్ అవసరం లేకుండా కేవలం ఫోన్ నంబర్‌తోనూ లాగిన్ అయ్యే వెసులుబాటు ఉంది. ఇతర యాప్‌ల మాదిరిగానే సమావేశాలను షెడ్యూల్ చేసుకోవచ్చు. ఫ్రీప్లాన్‌లో ఐదుగురు వినియోగదారులు, బిజినెస్ ప్లాన్‌లో 100 మంది యూజర్ల వరకు జియో మీట్ పాల్గొనే వీలుంది.