వలస కార్మికుల కోసం రెండు ప్రత్యేక రైళ్లు

Update: 2020-05-01 16:52 GMT

కేంద్రం వలస కూలీలను తరలించడానికి అనుమతి ఇవ్వటంతో.. దీనికి తగ్గట్టుగా పలు రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అయితే.. బస్సుల్లో వలస కార్మికులను తరలించడం అంత సులభం కాదని.. ప్రత్యేక రైళ్లను నడపాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. ముందుగా.. వలస కార్మికుల కోసం రైల్వే సదుపాయం కలించలేమని చెప్పిన కేంద్రం.. తాజాగా.. ప్రత్యేక రైళ్లను నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో.. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్‌లోని హాటియాకు శుక్రవారం బయల్దేరింది. అటు.. కేరళ నుంచి కూడా మరో రైలు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బయల్దేరనున్నట్లు సమాచారం. కేరళలోని ఎర్నాకులం నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు ఈ ప్రత్యేక రైలులో వలస కార్మికులను తరలించనున్నట్లు తెలిసింది.

Similar News