ఉత్తరప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇక ఆగ్రాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఆగ్రాలో ఇప్పటివరకు కొత్తగా 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆగ్రాలో మొత్తం కేసులు 526కు చేరింది.