భారత్ లో గడిచిన 24 గంటల్లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతీరోజు వెయ్యికి పైగా కేసులు నమోదవ్వగా.. తాజాగా 1993 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం 35,043 కేసులు నమోదయ్యాయని కుటుంబ, ఆరోగ్య సంక్షేమ కేంద్ర మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గత 24 గంటల్లో 564 మంది డిశ్చార్జ్ అయ్యారని.. దీంతో డిశ్చార్ అయినా వారి సంఖ్య 8,889కి చేరిందని అన్నారు. ఇప్పటి వరకు 1,147 మంది మరణించారని లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలను సడలించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది.