మాస్కుల పేరుతో మోసం..

Update: 2020-05-01 20:03 GMT

కరోనా కాలంలో కొత్త రకాల మోసాలు బయటపడుతున్నాయి. ఎన్95 మాస్కులు ఎక్కడా దొరకట్లేదని ఆన్‌లైన్ ఆర్డర్ చేశారు నగరానికి చెందిన ఓ డాక్టర్. అసలే ఆ మాస్కులు రేటెక్కువ. ఆన్‌లైన్‌లో తక్కువకి వస్తున్నాయని ఆర్డర్ పెట్టారు డాక్టర్. మాస్కులు త్వరగా డెలివరీ చేయాలంటే ముందుగానే డబ్బులు చెల్లించమని షరతు పెట్టారు. దాంతో డాక్టర్ తన అకౌంట్ నుంచి రూ.56 వేలు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇంకా రావట్లేదని కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న డాక్టర్ సైబర్ క్రైం పోలీసులను సంప్రదించారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News