విశాఖ ఏజెన్సీలో పెన్షన్లు పంపిణీచేస్తూ గుండెపోటుతో మరణించిన గబ్బాడ అనూరాధ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించారు. విపత్తు సమయంలో విశేషంగా పనిచేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మొత్తాన్ని వీలైనంత త్వరగా ఆ కుటుంబానికి చేరవేయాలని అధికారులను ఆదేశించారు.