PAWAN: జంతు సంరక్షణకు "హనుమాన్‌"

పవన్ మానసపుత్రిక హనుమాన్ ప్రారంభం... ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్.. వన్య ప్రాణులకు అత్యవసర వైద్యం

Update: 2026-03-03 07:30 GMT

ప్ర­కృ­తి సమ­తు­ల్యత కా­పా­డ­టం మన అం­ద­రి బా­ధ్యత అని స్ప­ష్టం చే­స్తూ, వన్య­ప్రా­ణుల సం­ర­క్ష­ణ­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం కీలక అడు­గు వే­సిం­ది. మను­షు­లు–జం­తు­వుల మధ్య పె­రు­గు­తు­న్న సం­ఘ­ర్ష­ణ­ను తగ్గిం­చేం­దు­కు రా­ష్ట్ర అట­వీ­శా­ఖ­ను మరింత బలో­పే­తం చే­స్తు­న్నా­మ­ని డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ తె­లి­పా­రు. ప్ర­పంచ వన్య­ప్రా­ణుల ది­నో­త్స­వం సం­ద­ర్భం­గా మం­గ­ళ­గి­రి­లో ని­ర్వ­హిం­చిన కా­ర్య­క్ర­మం­లో ఆయన ‘హను­మా­న్ ఫౌం­డే­ష­న్ ప్రా­జె­క్టు’ను ప్రా­రం­భిం­చా­రు. మం­గ­ళ­గి­రి­లో­ని ఏపీ­ఎ­స్పీ బె­టా­లి­య­న్ ప్రాం­గ­ణం­లో జరి­గిన ఈ వే­డు­క­ల­కు పర్యా­వ­రణ వే­త్త­లు, అట­వీ­శాఖ అధి­కా­రు­లు, జంతు ప్రే­మి­కు­లు హా­జ­ర­య్యా­రు. ఈ సం­ద­ర్భం­గా పవన్ కళ్యా­ణ్ మా­ట్లా­డు­తూ వన్య­ప్రా­ణుల నుం­చి మను­షు­ల­ను రక్షిం­చ­డ­మే కా­కుం­డా, జం­తు­వుల సహజ ని­వా­సా­ల­ను కా­పా­డ­టం కూడా ప్ర­భు­త్వ బా­ధ్యత అని అన్నా­రు. అడ­వు­ల్లో ని­వ­సిం­చే జం­తు­వు­లు జనా­ర­ణ్యం­లో­కి రా­కుం­డా టె­క్నా­ల­జీ ఆధా­రం­గా చర్య­లు చే­ప­డు­తు­న్నా­మ­ని చె­ప్పా­రు. ‘హను­మా­న్’ ప్రా­జె­క్టు ద్వా­రా అట­వీ­శాఖ పని­తీ­రు­ను మరింత సమ­ర్థ­వం­తం­గా మా­ర్చ­ను­న్న­ట్లు ఆయన వి­వ­రిం­చా­రు. ఈ ప్రా­జె­క్టు కింద 100 ప్ర­త్యేక వా­హ­నా­ల­ను అట­వీ­శా­ఖ­కు అం­ద­జే­శా­రు. అద­నం­గా వన్య­ప్రా­ణుల అత్య­వ­సర వై­ద్యం, రక్షణ చర్యల కోసం ప్ర­త్యేక అం­బు­లె­న్స్‌­ల­ను అం­దిం­చా­రు. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 19 అత్య­వ­సర సహాయ బృం­దా­ల­ను సి­ద్ధం చే­సి­న­ట్లు తె­లి­పా­రు.

అలా­గే ఏడు ప్రాం­తా­ల్లో అత్య­వ­సర చి­కి­త్స, పు­న­రా­వాస కేం­ద్రా­ల­ను ఏర్పా­టు చే­సి­న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. అటవీ సరి­హ­ద్దు గ్రా­మా­ల్లో అల­ర్ట్ వ్య­వ­స్థ­ను ఏర్పా­టు చే­సి­న­ట్లు పవన్ కళ్యా­ణ్ తె­లి­పా­రు. ము­ఖ్యం­గా రా­య­ల­సీమ, ఉత్త­రాం­ధ్ర జి­ల్లా­ల్లో అడవి ఏను­గుల వల్ల ప్ర­జ­లు ఎదు­ర్కొం­టు­న్న సమ­స్య­ల­ను దృ­ష్టి­లో ఉం­చు­కు­ని ప్ర­త్యేక కా­ర్యా­చ­రణ రూ­పొం­దిం­చా­మ­ని చె­ప్పా­రు. చి­త్తూ­రు జి­ల్లా సహా ఏజె­న్సీ ప్రాం­తా­ల్లో ఏను­గుల సమ­స్య­ను సమ­ర్థం­గా ఎదు­ర్కొ­న్నా­మ­ని, అవ­స­ర­మై­తే కర్ణా­టక నుం­చి కుం­కీ ఏను­గు­ల­ను తె­చ్చి పరి­స్థి­తి­ని ని­యం­త్రిం­చి­న­ట్లు వి­వ­రిం­చా­రు. జీ­పీ­ఎ­స్ ట్రా­కిం­గ్ సి­స్ట­మ్‌­ను కూడా ఈ కా­ర్య­క్ర­మం­లో ఆవి­ష్క­రిం­చా­రు. దీని ద్వా­రా అడవి జం­తు­వుల కద­లి­క­ల­ను పర్య­వే­క్షిం­చి ముం­ద­స్తు హె­చ్చ­రి­క­లు జారీ చే­య­వ­చ్చ­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు. మను­షు­లు–వన్య­ప్రా­ణుల మధ్య సం­ఘ­ర్షణ తగ్గిం­చ­డ­మే ఈ ప్రా­జె­క్టు ప్ర­ధాన లక్ష్య­మ­ని పవన్ కళ్యా­ణ్ స్ప­ష్టం చే­శా­రు. ఈ భూ­మి­పై మను­షు­ల­తో పాటు జం­తు­వు­ల­కూ సమాన హక్కు ఉం­ద­ని, ప్ర­కృ­తి­ని కా­పా­డ­టం అంటే భవి­ష్య­త్ తరా­ల­కు భద్రత కల్పిం­చ­డ­మే­న­ని ఆయన అన్నా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం ఏర్ప­డిన తర్వాత వన్య­ప్రా­ణుల దా­డు­ల్లో గా­య­ప­డిన లేదా మర­ణిం­చిన వా­రి­కి నా­లు­గు కో­ట్ల రూ­పా­యల పరి­హా­రం చె­ల్లిం­చి­న­ట్లు డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ గు­ర్తు చే­శా­రు.

ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. హనుమాన్ ప్రాజెక్టును పకడ్బందీగా రూపొందించిన అటవీశాఖ అధికారులను పవన్ కళ్యాణ్ అభినందించారు. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకుంటామని ప్రకటించారు. మొత్తంగా, వన్యప్రాణి సంరక్షణలో సాంకేతికతను వినియోగిస్తూ, అటవీశాఖను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పవచ్చు. మనుషులు, జంతువులు సహజీవనం చేసే వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు అమలు అవుతుండగా, ఇది రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News