122 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్..

Update: 2020-05-02 18:31 GMT

ఢిల్లీలోని 31 వ బెటాలియన్‌కు చెందిన 122 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సిబ్బందికి కరోనా సోకింది. ఇంకా వందమంది నమూనాలు పెండింగ్ లో ఉన్నట్టు వార్తా సంస్థ పిటిఐ శనివారం నివేదించింది. కాగా ఇందులో ఎక్కువ మందికి లక్షణాలు లేకుండానే బయటపడింది. దీంతో రోగులను ఢిల్లీలోని మాండోలి వద్ద ఐసోలేషన్ వార్డులో చేర్చారు. కాగా వ్యాధి భారిన పడినవారు దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ అయినా 31 వ బెటాలియన్‌కు చెందినవారు, ఇందులో 1000 మందికి పైగా సైనికులు ఉన్నారు.. వారు దేశ రాజధాని మయూర్ విహార్ ఫేజ్ -3 ప్రాంతంలో ఉన్నారు.

Similar News