మరో 2నెలలు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని పొడిగించిన ఫ్రాన్స్

Update: 2020-05-02 21:51 GMT

కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మే 24తో ముగుస్తున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితిని మరో రెండు నెలలపాటు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనను సోమవారం పార్లమెంట్ లో ప్రవేశపెడతామని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి ఒలివియర్ వెరాన్ తెలిపారు. జూన్ 24వరకూ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కొనసాగిస్తామని తెలిపారు. మార్చి 24న విధించిన ఎమర్జెన్సీని ఈ నెలలో ఎత్తివేస్తే కరోనా వైరస్ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

Similar News