కరోనా బాధితుల సేవలో నిమగ్నమై జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లిని కూడా వాయిదా వేసుకుంది నర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న షర్మిల. చండీగఢ్‌లోని సెక్టార్ 49లో గల డిస్పెన్సరీలో పని చేస్తున్న నర్స్ షర్మిలా కుమారికి మే 1న వివాహం వివాహం జరగాల్సి ఉంది. లాక్డౌన్ ముందే ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి నాటికి లాక్డౌన్ ముగియకపోగా షర్మిల క్షణం తీరిక లేకుండా హాస్పిటల్‌లో డ్యూటీ చేస్తోంది. పెళ్లి తరవాతైనా చేసుకోవచ్చు. ముందు కరోనాని తరిమి కొట్టాలి. పెళ్లి కన్నా దేశ సేవ ఎంతో ముఖ్యం అని యూనీఫామ్ ధరించి రోగుల సేవలో నిమగ్నమైంది. ఈ సంక్షోభ సమయంలో కర్తవ్య నిర్వహణ ముఖ్యమని షర్మిల తెలిపారు.