మహారాష్ట్ర సీఎం ఇంటివద్ద ఉండే ముగ్గురు పోలీసులకు కరోనా పాజిటివ్

Update: 2020-05-02 22:41 GMT

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ.. వెలుపల డ్యూటీ చేస్తోన్న ముగ్గురు పోలీసులకు శనివారం కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఇటీవల వీరిని సీఎం ఇంటివద్ద పోస్ట్ చేశారు ఉన్నతాధికారులు. వారు స్థానిక ఆయుధ విభాగానికి చెందినవారని తెలుస్తోంది. దీంతో మాతోశ్రీ వెలుపల ఉన్న ఇతర పోలీసుల కోసం మాస్-స్కేల్ కాంటాక్ట్ ట్రేసింగ్ , టెస్టింగ్ ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం సీఎం ఇంటివద్ద డ్యూటీ చేస్తోన్న పోలీసులను అందరిని మార్చాలని.. కొత్త సిబ్బందిని నియమించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Similar News