కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కరోనా వ్యాప్తి చెందేలా ప్రయత్నించే వారిపై జరీమానాలు విధించనుంది. బహిరంగ ప్రదేశాల్లో, పని స్థలాల్లో సామాజిక దూరం పాటించాలని.. పాటించని వారికి 200రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. అటు, ముఖానికి మాస్క్ ధరించకపొతే.. వెయ్యిరూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈమేరకు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే కఠినంగా ఉండక తప్పదని.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలని కర్ణాటక అదనపు చీఫ్ సెక్రటరీ జావేద్ అఖ్తర్ చెప్పారు. కొన్ని పరిశ్రమలు ప్రారంభించేందుకు సర్కారు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని సర్కారు ఆదేశించింది.
కాగా, రాజస్థాన్ ప్రభుత్వం కూడా కరోనాను నియంత్రించే చర్యల్లో భాగంగా జరిమానాలు విధిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.