ఇటలీలో ఇంకా తగ్గని కేసుల ఉదృతి.. 24 గంటల్లో..

Update: 2020-05-05 17:34 GMT

ఇటలీలో ఇప్పటివరకు 29 వేల 79 మరణాలు సంభవించాయి. ఇక్కడ మొత్తం 2 లక్ష 11 వేల 938 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. అమెరికా తరువాత అత్యధిక మరణాలు ఇటలీలోనే ఉన్నాయి. 24 గంటల్లో 195 మంది మరణించారని ఇటలీ సివిల్ ప్రొటెక్షన్ విభాగం అధిపతి ఏంజెలో బొర్రెల్లి చెప్పారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం మరణించిన వారి సంఖ్య పెరిగిందని అన్నారు.

ఆదివారం, కరోనాతో 174 మంది రోగులు మరణించారు. మార్చి 10 నుండి దేశంలో అమలు చేసిన లాక్‌డౌన్‌ను మే 3 వరకు కొనసాగింది. ఆ తరువాత కొన్ని సడలింపులు ఇవ్వడంతో దుకాణాలను తెరుచుకున్నాయి. కాగా ఇటలీలో మొదటి కేసు ఫిబ్రవరి 21 న నమోదైంది.

Similar News