రెండు మూడు నెలల నుంచి కరోనా మహమ్మారి పేరు వింటున్నాం కానీ.. ఫ్రాన్స్‌లో గత ఏడాది డిసెంబర్లోనే మొదటి కరోనా కేసు నమోదైనట్లు డాక్టర్ కోహెన్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 27న ఓ కేసును పరిశీలించిన ఆయన.. ఆ పేషెంట్‌కు కరోనా సోకినట్లు గుర్తించారు. కానీ జనవరి 24న మూడు కరోనా కేసులను ఫ్రాన్స్‌లో వెలుగు చూశాయి. పారిస్‌లోని ఏవిసెన్ని, జీన్ వెర్డైర్ హాస్పిటల్స్ల్లో పేషెంట్లకు ఫ్లూ లాంటి లక్షణాలను డిసెంబర్లో గుర్తించామని కోహెన్ అంటున్నారు. 14 మంది రోగులను పరిక్షిస్తే అందులో ఒకరికి కరోనా సోకినట్లు గుర్తించామన్నారు. ఒకటికి రెండు సార్లు పరిక్షించిన తరువాతే అది కరోనా వైరస్ అని గుర్తించామన్నారు.