వాహనదారులకు షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Update: 2020-05-05 13:16 GMT

దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. దాదాపు 50 రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు భారీగా పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.1.67 పెరిగింది. అలాగే డీజిల్ ధర కూడా లీటరుకు ఏకంగా రూ.7.10 పెరిగింది. ఢిల్లీ ప్రభుత్వం వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)‌ను పెంచింది. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.71.26 పైసలకు, లీటర్‌ డీజిల్‌ ధర రూ.69.39 పైసలకు చేరింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

Similar News