టీవీ 5 కార్యాలయం పై దాడిని వ్యతిరేకించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం
టీవీ 5 కార్యాలయం పై దాడి దారుణం అని జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు అయిన తెలకపల్లి రవి అన్నారు. మీడియా కేంద్రంపై రాళ్ళు విసిరి విధ్వంసానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు, ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికి తీయాలని అన్నారు. అదే సందర్భంలో మీడియా సంస్థలకు, వివిధ బాధ్యతల్లో పనిచేసే వారికి భద్రత కల్పించాలని అన్నారు.
టీవీ 5 కార్యాలయం పై జరిగిన దాడిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని యూనియన్ అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, TEMJU అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్... దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.