ఇకపై రేషన్ ఇంటికే..

Update: 2020-05-08 19:11 GMT

ఇకపై రేషన్ కోసం దుకాణానికి వెళ్లక్కర్లేదు. లైన్లో నిలబడక్కర్లేదు. ఏపీ సర్కారు రేషన్ దుకాణాల నుంచి నేరుగా ఆ ఇంటి యజమానికే అందజేయనుంది. సెప్టెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బియ్యం నాణ్యత, పంపిణీలో పారదర్శకత, అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది. మొబైల్ వాహనాల ద్వారా నేరుగా లబ్ధిదారలు ఇళ్లకు వెళ్లి బియ్యం సరఫరా చేస్తారు. ఇందుకోసం ఉపయోగించే సంచులు సైతం నాణ్యంగా ఉండేలా చూస్తున్నారు. మరో రెండు మూడు నిత్యావసర వస్తువులతో పాటు బియ్యం డోర్ డెలివరీకి పౌరసరఫరాల శాఖ సన్నద్ధమవుతోంది. గ్రామ వాలంటీర్లకు ఈ బాధ్యత అప్పగించింది ఏపీ ప్రభుత్వం.

Similar News