సీఎం నిర్ణయం.. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి..

Update: 2020-05-10 16:44 GMT

తెలంగాణ సర్కార్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల సంఖ్య 26,588 మంది ఉద్యోగులకు మూడేళ్ల పాటు అదనపు సర్వీసు ప్రయోజనం కలుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు అమలులోకి వస్తే ఈ ఏడాది ఆగస్ట్ ఒకటి నుంచి 2023 జులై 31 వరకు పదవీ విరమణలు ఉండవు. ఈ క్రమంలో మూడేళ్లలో రిటైరయ్యేవారికి చెల్లించాల్సిన ప్రయోజనాలను తక్షణమే చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.3,500 కోట్ల భారం తప్పుతుంది.

ఇక ఈ నిర్ణయం కారణంగా నిరుద్యోగులు నిరాశ చెందకుండా వారికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే యోచనలో ఉంది తెలంగాణ సర్కారు. కరోనా ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వం ఆర్ధిక భారాన్నుంచే గట్టెక్కేదిశగా పలు అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. కాగా, ఆర్థికంగా బలంగా ఉన్న పొరుగు రాష్ట్రం తమిళనాడు సైతం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి 58 నుంచి 59 సంవత్సరాలకు పెంచారు. ఈ ఉత్తర్వులు 07.05.20 నుంచి అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం అక్కడి అన్ని శాఖల ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లలోని ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల్లో పని చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఫ్రొఫెసర్లకు వర్తించనున్నాయి. అదే నిర్ణయంతో ఏకీభవిస్తూ తెలంగాణ సర్కారు కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై దృష్టి సారించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Similar News