దేశంలో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలోని పాలంలో గరిష్టంగా 42.2 డిగ్రీ సెల్సియస్, సఫ్దర్‌జంగ్‌లో 40.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు, రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో కూడా 45 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం వేడి గాలులు వీచే అవకాశం ఉందని.. ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.