మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతి నొప్పితో రెండు రోజుల క్రితం ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో ఆయన సన్నిహితులు ఎయిమ్స్ చేర్పించారు. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ సారధ్యంలో మన్మోహన్‌కు చికిత్స అందించారు. రెండ్రోజుల్లోనే ఆయన కోలుకోవడంతో ఎయిమ్స్ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. 2009లో ఆయనకు కొరోనరీ బైపాస్ సర్జరీ జరిగింది